ముంబై కి చెందిన ఆదిత్య పల్చా అండ్ కైవల్య ఓహరా అనే ఇద్దరు కుర్రాళ్ళు 2020 కరోనా టైం లో క్విక్ కామర్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ని బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు సుమారు 30 వేల కోట్ల రూపాయల కంపెనీని బిల్డ్ చేశారు అదే జెప్టో అయితే వీళ్ళు ఒక ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ ని డెవలప్ చేయడం మాత్రమే కాదు ఇండియన్ ఎఫ్ఎం సిజి మార్కెట్ లో ఎంతో ఫేమస్ కంపెనీ అయిన.
డిమార్ట్ ని కేవలం రెండేళ్లలోనే ఓడిస్తామని ఛాలెంజ్ చేసి పని చేస్తున్నారు సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు క్విక్ కామర్స్ బిజినెస్ అంటే ఏంటి నిజంగా ఇందులో అంత ఎక్కువ లాభాలు వస్తాయా ఈ క్వశ్చన్ ఎందుకు రైస్ చేశానంటే రీసెంట్ టైమ్స్ లో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు సడన్ గా ఈ క్విక్ కామర్స్ బిజినెస్ మీదే పడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జెప్టో.
సక్సెస్ అయిన తర్వాత ముకేష్ అంబాని డన్జో అనే ఒక క్విక్ కామర్స్ కంపెనీలో 25% వాటా కొనేసారు టాటా కంపెనీ బిగ్ బాస్కెట్ ని అలాగే zomato బ్లింకిట్ అనే ఒక క్విక్ కామర్స్ కంపెనీని కొనేసాయి స్విగ్గి కూడా స్విగ్గి ఇన్స్టామార్ట్ అనే పేరుతో ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ స్టార్ట్ చేసింది సో ఇక్కడ మీరు గమనిస్తే ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బిజినెస్ లో ఎలా అయితే ఎన్నో.
కంపెనీలు పుట్టుకొచ్చాయో సేమ్ అలాగే ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లో కూడా ఎన్నో కంపెనీలు పుట్టుకొస్తున్నాయి కానీ ఈసారి పోటీ పడేది స్టార్టప్ కంపెనీలు కాదు టాటా రిలయన్స్ అండ్ zomato లాంటి బిలియన్ డాలర్ వాల్యూషన్ లో ఉన్న బడా కంపెనీలు అయితే వీళ్ళందరినీ తట్టుకొని జెప్టో ముందుకు ఎలా వెళ్తుంది అసలు వీళ్ళు ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ని ఫాలో.
అవుతూ డిమార్ట్ ని ఓడిస్తున్నారో నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను గాయ్స్ ఈ కేస్ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో జాగ్రత్తగా వినండి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సూర్య ఆదిత్య పల్చా అండ్ కైవల్య ఓహరా వీళ్ళిద్దరూ కూడా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు కలిసే చదువుకున్నారు.
కంప్యూటర్ సైన్స్ లో డిప్లమా కంప్లీట్ చేశాక వీళ్ళు డిగ్రీ చదవడానికి అమెరికాలో ఉన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు వీళ్ళిద్దరికీ ఎప్పటికైనా బిజినెస్ చేయాలనే ప్యాషన్ ఉంది ఆ ప్యాషన్ తో వీళ్ళు చదువు మీద కాన్సంట్రేట్ చేయలేక 19 ఏళ్ల వయసులో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీని మధ్యలోనే వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఇండియాకి.
వచ్చేసారు బిజినెస్ చేయాలనే ప్యాషన్ ఉంది కానీ ఏ బిజినెస్ చేయాలో వీళ్ళిద్దరికీ సరైన క్లారిటీ లేదు అదే టైం లో కరోనా వైరస్ వచ్చి ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది లాక్ డౌన్ టైం లో ఈ ఇద్దరు స్నేహితులు ఇంట్లో కూర్చుని ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్న టైం లో ప్రజలు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం వీళ్ళకి కనిపించింది అదేంటంటే లాక్ డౌన్.
వల్ల ప్రజలు ఎవరు కూడా కిరానా స్టోర్స్ కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన నిత్యవసర సరుకులని ఇంటికి తెచ్చుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆన్లైన్ లో గ్రోసరీస్ ఆర్డర్ పెట్టిన అవి రావడానికి అప్పట్లో త్రీ టు ఫోర్ డేస్ టైం పట్టేది ఇది గమనించిన ఆదిత్ అండ్ కైవల్య కి ఒక ఐడియా వచ్చింది అదే క్విక్ కామర్స్ అంటే మనం ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే అది డెలివరీ అవ్వడానికి.
రోజులో వారాలో టైం తీసుకోకుండా ఒక గంటలోనే అది మన సరుకుని ఇంటికి డెలివరీ చేస్తే ఆ బిజినెస్ నే క్విక్ కామర్స్ బిజినెస్ అంటారు అయితే వీళ్ళకి వచ్చిన ఐడియా వాళ్ళ సొంత ఐడియా కాదు వాళ్ళు అమెరికాలో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇన్స్టా కార్ట్ అనే ఒక ఈ కామర్స్ కంపెనీ ఇలాగే ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన గ్రోసరీస్ ని ఫాస్ట్ గా కస్టమర్స్ కి డెలివరీ చేస్తూ అమెరికాలోనే.
ఒక పెద్ద కంపెనీగా ఎదిగింది అది చూసిన ఈ ఇద్దరు స్నేహితులు ఇదే బిజినెస్ మోడల్ ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు కానీ అది అంత ఈజీగా జరిగిపోలేదు బికాజ్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే టైం కి వాళ్ళ వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే ముందు వాళ్ళ ఐడియా వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ముంబైలో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫోన్ నెంబర్స్.
తీసుకుని ఒక whatsapp గ్రూప్ ని క్రియేట్ చేశారు ఆ గ్రూప్ లో ఎవరు ఏది ఆర్డర్ చేసినా వీళ్ళే స్వయంగా డెలివరీ చేసి డబ్బులు తీసుకునేవారు అలా ఆ whatsapp గ్రూప్ లో కస్టమర్స్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఈ బిజినెస్ మీద నమ్మకం వచ్చి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒక ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ని బిల్డ్ చేశారు అదే కిరాణ కార్ట్ అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన.
విషయం ఏంటంటే ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ అనే కాన్సెప్ట్ ఇండియాలో వీళ్ళు స్టార్ట్ చేసింది కాదు అది 2011 నుండే ఉంది బిగ్ బాస్కెట్ అండ్ బ్లింకిట్ లాంటి కంపెనీలు ఆల్రెడీ ఆ బిజినెస్ ని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాయి సో ఆ కంపెనీలని దాటుకొని ఎదగడానికి ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి కిరాణ కార్ట్ ని వన్ అవర్ డెలివరీ యాప్ గా మార్కెటింగ్ చేశారు అంటే మీరు కిరాణ.
కార్ట్ లో ఏ వస్తువు ఆర్డర్ చేసినా అది గంట లోపే మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది అర్థమైందా కానీ అప్పట్లో బిగ్ బాస్కెట్ అండ్ బ్లింకిట్ లాంటి కంపెనీలు గ్రోసరీస్ ని డెలివరీ చేయడానికి ఒకటి నుండి రెండు రోజులు టైం తీసుకునేవి ఫైనల్ గా కిరాణ కార్ట్ అనే బిజినెస్ సక్సెస్ అయింది కానీ ఈ సక్సెస్ ఎన్నో రోజులు కొనసాగలేదు దీనికి రీసన్ ఏంటో అర్థం కావాలంటే ఇప్పుడు నేను.
చెప్పేది జాగ్రత్తగా వినండి లాక్ డౌన్ టైం లో చాలా కంపెనీలకి సడన్ గా డిమాండ్ పెరిగిపోయి లాక్ డౌన్ తీసేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ ని కోల్పోయి మూతపడే సిట్యువేషన్ కి వచ్చేసాయి దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి కరోనా టైం లో పిల్లలు స్కూల్ కి వెళ్ళకపోవడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ కి డిమాండ్ పెరిగి బైజూస్ లాంటి ఎడ్యుటెక్ కంపెనీలు వేల.
కోట్ల బిజినెస్ చేసుకున్నాయి కానీ లాక్ డౌన్ తీసేసిన తర్వాత పిల్లలు నార్మల్ గా స్కూల్ కి వెళ్లడంతో ఆన్లైన్ ఎడ్యుటెక్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీలు మూతపడే సిట్యువేషన్ కి వచ్చేసాయి లైక్ బైజూస్ అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సేమ్ ఇలాగే లాక్ డౌన్ ఇత్తేసిన తర్వాత ప్రజలు కూడా కూడా ఫ్రీగా బయటికి వచ్చి ఎప్పట్లాగే వాళ్ళ సందు చివర ఉన్న.
కిరాణ స్టోర్స్ నుండి 10 నిమిషాల్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని తీసుకెళ్లేవారు అంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ కోసం ఆన్లైన్ లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది లాజిక్ అర్థమైందా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు ప్రజలు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన గ్రోసరీస్ కోసం త్రీ టు ఫోర్ డేస్ వెయిట్ చేయలేక.
డిమార్ట్ లాంటి స్టోర్స్ కి వెళ్లి డైరెక్ట్ గా ఆఫ్లైన్ లో కొనుక్కునేవారు కానీ కరోనా టైం లో వాళ్ళకి ఆఫ్లైన్ లో కొనుక్కునే అవకాశం లేక ఆన్లైన్ లో ఆర్డర్ చేసి కనీసం గంట సేపు వెయిట్ చేసేవారు కానీ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు ఆ వన్ అవర్ టైం పీరియడ్ కూడా కస్టమర్స్ కి ఎక్కువగా అనిపించి వాళ్ళు డైరెక్ట్ గా ఆఫ్లైన్ కిరానా స్టోర్స్ కి వెళ్లి.
సరుకుని తెచ్చేసుకుంటున్నారు ఇలాంటి సిట్యువేషన్ లో ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ బిజినెస్ ని కంటిన్యూ చేయాలంటే డెలివరీ టైం ని ఇంకా తగ్గించి ఒక కస్టమర్ తనకి ఇమీడియట్ గా కావాల్సిన వస్తువు సందు చివరికి వెళ్లి తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం లో మనం వాళ్ళ డోర్ స్టెప్స్ కి ఆ సరుకుని డెలివరీ చేస్తే అప్పుడు ఈ ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ.
బిజినెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ అలా చేయలేకపోతే ఫ్యూచర్ లో వాళ్ళు స్టార్ట్ చేసిన కిరాణ కార్ బిజినెస్ ని కూడా మూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి సో ఇక్కడ వాళ్ళ ముందు ఉన్నది రెండే ఆప్షన్స్ ఆప్షన్ నెంబర్ వన్ వీళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్న వన్ అవర్ డెలివరీ బిజినెస్ ని సేమ్ అలాగే రన్ చేస్తూ ఫ్యూచర్ లో నష్టపోవాలి ఆప్షన్ నెంబర్ టూ కాస్త.
కష్టమైన ఒక కొత్త బిజినెస్ మోడల్ ని డెవలప్ చేసి కస్టమర్స్ కి వన్ అవర్ లో కాకుండా కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ని వాళ్ళ ఇంటికి డెలివరీ చేయాలి ఇందులో వీళ్ళు ఆప్షన్ నెంబర్ టు ని చూస్ చేసుకున్నారు అండ్ అందులో నుంచి పుట్టిందే 10 మినిట్ డెలివరీ కాన్సెప్ట్ జెప్టో సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు జెప్టో 10 నిమిషాల్లోనే ఎలా.
డెలివరీ చేస్తుంది చెప్తా చూడండి ఆదిత్ అండ్ కైవల్య కలిసి మొదట్లో కిరాణ కార్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ ఏదైనా ప్రొడక్ట్ ని ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ తన దగ్గరలో ఉన్న ఏ కిరాణ స్టోర్ లో ఆ ప్రొడక్ట్ ఉందో తెలుసుకొని అక్కడ కొని కస్టమర్ కి డెలివరీ చేసేవారు కానీ దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం.
టైమే కాబట్టి దాన్ని తగ్గించడానికి డార్క్ స్టోర్ మోడల్ అనే ఒక కొత్త బిజినెస్ మోడల్ ని వీళ్ళు జెప్టో లో ఇంప్లిమెంట్ చేశారు ఇది ఎలా పని చేస్తుందంటే జెప్టో కంపెనీ ఒక సిటీలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సిటీలో ఉన్న ప్రతి మూడు కిలోమీటర్స్ కి ఒక డార్క్ స్టోర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది డార్క్ స్టోర్ అంటే సరుకుని నిల్వ చేసే వేర్ హౌస్ లాంటి ఒక.
ప్లేస్ అన్నమాట కస్టమర్స్ ఆర్డర్ చేసే ప్రతి వస్తువుని జెప్టో కంపెనీ అక్కడ ముందుగానే పెట్టి నిల్వ ఉంచుతుంది అంటే ఒక కస్టమర్ ఏదైనా ప్రొడక్ట్ ని ఆర్డర్ చేస్తే ఇమీడియట్ గా 3 km రేడియస్ లో ఉన్న డెలివరీ బాయ్ ఆ ఆర్డర్ ని పిక్ చేసుకొని ప్రొడక్ట్ ని ఎక్కడ కొనాలి అనే కన్ఫ్యూషన్ లేకుండా డైరెక్ట్ గా జెప్టో యొక్క డార్క్ స్టోర్స్ నుండి కస్టమర్ కి డెలివరీ చేస్తారు అయితే.
ఇక్కడ మీకు మరొక డౌట్ రావచ్చు ఎంత డార్క్ స్టోర్స్ పెట్టి మెయింటైన్ చేసినా మరి 10 నిమిషాల్లో డెలివరీ కష్టం కదా అని దీనికి వీళ్ళు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు అదే లోకస్ ఇది ఒక ఏఐ టెక్నాలజీ ఇది ఎలా పనిచేస్తుందంటే కస్టమర్ ఒక ఆర్డర్ పెట్టినప్పుడు ఈ లోకస్ అనే ఏఐ టెక్నాలజీ కస్టమర్ ఫోన్ నుండి జియో స్టాటిస్టికల్ డేటా అండ్ ట్రాఫిక్.
డైనమిక్స్ లాంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక కస్టమర్ ఏదైనా వస్తువుని ఆర్డర్ పెట్టినప్పుడు తను ఎక్కడ ఉన్నాడు తన చుట్టుపక్కల ఉన్న ట్రాఫిక్ ఎలా ఉంది డెలివరీ బాయ్ ఏ రూట్ లో వెళ్తే కస్టమర్ కి ప్రొడక్ట్ ని వీలైనంత తక్కువ టైం లో డెలివరీ చేయగలడు అనే ఇన్ఫర్మేషన్ ని ఈ లోకస్ టెక్నాలజీ అనాలసిస్ చేసి 10.
నిమిషాల్లో డెలివరీ చేయగల డెలివరీ పార్ట్నర్ కి ఈ ఆర్డర్ ని పంపిస్తుంది ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ప్రెసెంట్ జెప్టో కంపెనీ దేశ వ్యాప్తంగా 340 డార్క్ స్టోర్స్ పెట్టి లోకస్ టెక్నాలజీ ద్వారా 10 మినిట్స్ డెలివరీ అనే కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇప్పుడు అర్థమైందా జెప్టో యొక్క 10 మినిట్స్ డెలివరీ అనే కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియో.
చూస్తున్న వాళ్ళలో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది 10 మినిట్స్ డెలివరీ అనేది ఒక అబద్ధం నేను చాలా సార్లు జెప్టో లో ఆర్డర్ చేశాను కానీ నాకెప్పుడూ 10 మినిట్స్ లో డెలివరీ అవ్వలేదని మీలో కొంతమంది అనుకోవచ్చు సో ఇక్కడ నిజం ఏంటంటే 10 మినిట్స్ డెలివరీ అనేది ఈ కామర్స్ బిజినెస్ లో వచ్చిన ఒక అడ్వాన్స్మెంట్ ఒకప్పుడు ఆన్లైన్ లో పెట్టిన వస్తువుని.
డెలివరీ చేయడానికి టూ టు ఫోర్ డేస్ టైం టైం పట్టేది తర్వాత అది వన్ అవర్ కి తగ్గింది ఇప్పుడు అది 10 మినిట్స్ కే తగ్గింది 10 నిమిషాలు అన్నారని 100% డెలివరీస్ 10 మినిట్స్ లోనే ఇవ్వలేకపోవచ్చు బట్ అట్లీస్ట్ 10 మినిట్స్ డెలివరీ అనే కాన్సెప్ట్ వల్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా డెలివరీ అవుతుంది కదా మనం దాన్ని నోటిస్ చేయాలి.
బికాజ్ ఫ్యూచర్ లో ఈ టైం పీరియడ్ ఇంకా తగ్గొచ్చు దీన్నే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అంటారు అర్థమైందా నెక్స్ట్ జెప్టో ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లో సక్సెస్ అయ్యి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్న టైం లో కస్టమర్స్ కూడా వాళ్ళ టైం ని సేవ్ చేసుకొని కోవడానికి డిమార్ట్ రిలయన్స్ మార్ట్ అండ్ స్పెన్సర్స్ లాంటి ఆఫ్లైన్ గ్రోసరీ స్టోర్స్ కి వెళ్లడం.
తగ్గించి ఆన్లైన్ లోనే ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశారు దీన్నే చేంజ్ ఇన్ కస్టమర్ బిహేవియర్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే ట్రెండ్ మారిందన్నమాట ఈ చేంజ్ ని గమనించిన చాలా ఈ కామర్స్ కంపెనీలు ఇమీడియట్ గా క్విక్ కామర్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయడమో లేదా ఆల్రెడీ ఆ సెక్టార్ లో ఉన్న స్టార్టప్ కంపెనీలని కొనడం లాంటి యాక్టివిటీస్ చేశాయి లైక్ డన్జో ని.
రిలయన్స్ బ్లింకిట్ ని zomato అండ్ బిగ్ బాస్కెట్ ని tata లాంటి కంపెనీలు కొనేసాయి ఇప్పుడు సడన్ గా ఇన్ని కంపెనీలు ఈ బిజినెస్ లో ఎందుకు పోటీ పడుతున్నాయి అంటే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ అయిన డేటా ప్రకారం ప్రెసెంట్ ఇండియాలో ఉన్న క్విక్ కామర్స్ బిజినెస్ యొక్క మార్కెట్ వాల్యూ 28 బిలియన్ డాలర్స్ అంటే 23 వేల కోట్ల రూపాయలు ఇది ఫ్యూచర్ లో 45 బిలియన్.
డాలర్స్ కి పెరగబోతుంది అంటే సుమారు $370000 కోట్ల రూపాయలకి పైగా పెరగబోతుంది మన దేశంలో ఉన్న ఫుడ్ డెలివరీ బిజినెస్ కంటే కూడా ఈ ఆన్లైన్ గ్రోసరీ అనేది చాలా పెద్ద బిజినెస్ అవ్వబోతుంది అందుకే ఈ సెక్టార్ లో నెంబర్ వన్ అవ్వడానికి ఇన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి ప్రెసెంట్ ఈ సెక్టార్ లో పోటీ పడుతున్న కంపెనీల యొక్క మార్కెట్ షేర్ గమనిస్తే zomato కి చెందిన.
బ్లింకెట్ కంపెనీ 46% మార్కెట్ షేర్ తో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటే swiggy instamart 27% జెప్టో 21% మిగిలినవి 6% మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నాయి టాటా అండ్ రిలయన్స్ కంపెనీలకు సంబంధించిన డన్జో అండ్ బిగ్ బాస్కెట్ ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు దీనికి కారణం ఏంటో మనం ఇంకొక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం.
మాట్లాడుకోవాల్సిన లాస్ట్ పాయింట్ ఏంటంటే జెప్టో ఫౌండేషన్ చెప్పినట్టు కేవలం రెండేళ్లలోనే వాళ్ళు డిమార్ట్ ని దాటగలరా ఏదో ప్రిడిక్ట్ చేసినట్టు కాకుండా ఇది ఎలా సాధ్యపడుతుందో ఖచ్చితమైన డేటా తో మాట్లాడదాం అసలు జెప్టో ఫౌండర్ అయిన ఆది పల్చా కేవలం 24 నెలల్లోనే డిమార్ట్ సేల్స్ ని దాటతామని ఎందుకన్నారంటే 2023 లో జెప్టో కంపెనీ యొక్క రెవెన్యూ సుమారు ₹2000 కోట్ల.
రూపాయలు ఇది 2024 వచ్చేటప్పటికి 10000 కోట్లకి పెరిగింది అంటే జెప్టో కంపెనీ యొక్క ఆదాయం కేవలం ఒక సంవత్సరంలో ఐదు రెట్లు పెరిగిందన్నమాట ఇప్పుడు వీళ్ళ టార్గెట్ కంపెనీ dmart గురించి చూద్దాం 2023 లో dmart యొక్క రెవెన్యూ 48 వేల కోట్ల రూపాయలు ఇది 2024 కి 52 వేల కోట్ల రూపాయలకు పెరిగింది అంటే ఒక్క సంవత్సరంలో dmart కేవలం 8% మాత్రమే గ్రో అయింది సో.
ఇప్పుడు మనం జెప్టో అలాగే dmart ని కంపేర్ చేసి చూస్తే లాస్ట్ వన్ ఇయర్ లో జెప్టో కంపెనీ రెవెన్యూ 500% గ్రో అయ్యి 2000 కోట్ల నుండి 10000 కోట్లకు పెరిగితే డిమార్ట్ ఆదాయం 8% గ్రో అయ్యి 48 వేల కోట్ల నుండి 52 వేల కోట్లకు పెరిగింది జెప్టో కంపెనీ ఇదే స్పీడ్ లో నెక్స్ట్ ఇయర్ కూడా గ్రో అయితే వాళ్ళ రెవెన్యూ 50 వేల కోట్లు దాటేసి నెక్స్ట్ ఇయర్ డిమార్ట్.
ని కూడా దాటేస్తుంది సో ఈ గ్రోత్ అండ్ డేటా ని చూసే జెప్టో ఫౌండర్ అయిన ఆది పల్చా నెక్స్ట్ టు ఇయర్స్ లో వాళ్ళు డిమార్ట్ బిజినెస్ ని దాటేసి ఎదుగుతాం అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు లాజిక్ అర్థమైందా ఫైనల్ గా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 22 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగిన డిమార్ట్ ని కేవలం మూడు సంవత్సరాల.
క్రితం స్టార్ట్ అయిన జెప్టో దాటగలదా ఎందుకంటే రీసెంట్ గా డిమార్ట్ కూడా సొంతంగా ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ బిజినెస్ ని స్టార్ట్ చేసింది సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని.
సబ్స్క్రైబ్ చేయండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్